పాక్ భుభాగంలో భారత క్షిపణి.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

-

పాక్ భుభాగంలో భారత క్షిపణి పడటంపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పాక్ భుభాగంలో భారత క్షిపణి పేలుడు గురించి తీవ్ర గందర గోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. మార్చి 9 న తనిఖీ సమయంలో ప్రమాదవశాత్తూ క్షిపణి విడుదల జరిగిందని.. క్షిపణి యూనిట్ యొక్క సాధారణ నిర్వహణ తనిఖీ సమయంలో, సాయంత్రం 7 గంటల సమయంలో, ఒక క్షిపణి అనుకోకుండా విడుదలైందని చెప్పారు.

క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడింది..క్షిపణి ఘటన విచారకరమన్నారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించే అంశమని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుందని… క్షిపణి విడుదల పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణం విచారణ ద్వారానే తెలియనుందని.. క్షిపణి ఘటన నేపద్యంలో, రక్షణ పరికరాల కార్యకలాపాలు, నిర్వహణ తనిఖీల యొక్క ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version