శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు తొలిరోజు అట్టహాసంగా ముగిశాయి. మొదటి రోజు జరిగిన సమావేశాలకు కేంద్ర పర్యటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, హీరో రామ్‌చరణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశాలకు గ్లోబల్ స్టార్.. మెగావపర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. ఆర్థికాభివృద్ధికి సినిమా పర్యాటకం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్ చరణ్ పాల్గొన్నారు.
1986 నుంచి కశ్మీర్‌కు తరచుగా వస్తున్నానన్న రామ్‌చరణ్ కశ్మీర్‌లో తన తండ్రి చిరంజీవి సినిమాలు ఎక్కువగా షూటింగ్ జరిగేవని గుర్తుచేశారు. గుల్మార్గ్, సోన్ మార్గ్‌లో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవని కశ్మీర్ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని రామ్ చరణ్ తెలిపారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్ జరిగిందని చరణ్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ సమావేశంలో పలువురు ప్రముఖులతో కలిసి చరణ్.. నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Global Star ✨ @AlwaysRamCharan is joined by Korean Ambassador Chang Jae-bok to dance on the Oscar winning Naatu Naatu song at #G20Summit #G20Kashmir #RamCharanForG20Summitpic.twitter.com/7AwVadcEDU
— Ujjwal Reddy (@HumanTsunaME) May 22, 2023