రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

-

బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే.. రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’  ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని  రాహుల్ గాంధీ అన్నారు.

దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని ఆరోపించారు.  దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి భానిసలుగా
మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పేద ప్రజలను తొలగించే
ఆయుధాలని ఈ దేశంలో అదానీ, అంబానీలకు బీజేపీ దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. ఈ
బిలియనీర్లు ఎంత ఎక్కువ డబ్బు పొందుతారో, మీకు అంత తక్కువ ఉపాధి లభిస్తుందని వెల్లడించారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version