ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాల పాటు ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చల స్థితిగతులను పుతిన్.. ప్రధాని మోదీకి వివరించారు. కాగా.. ఈ ఉక్రెయిన్, రష్యాల బృందాల చర్చలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో పాటు నేరుగా చర్చించాలని ప్రధాని మోదీ పుతిన్ కు సూచించారు. సుమీ ప్రాంతంలో కాల్పుల విరమణ ప్రకటన, మానవతా కారిడార్ ఏర్పాటు చేయడంపై పుతిన్ ను మోదీ ప్రశంసించారు.