బొత్స సంచలన వ్యాఖ్యలు.. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే

-

మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు హైదరాబాదే ఏపీకి రాజధాని అంటూ ప్రస్తావించారు. హైదరాబాదే ఏపీకి రాజధాని అంటూ కొత్త చర్చకు తెర లేపారు బొత్స. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారని.. రూ. 1.32 లక్షల కోట్లను డీబీటి ద్వారా అందించే అంశంపై మాట్లాడారని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది కాని టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి ప్రయత్నం చేశారు దురదృష్టకరమని అగ్రహించారు. టీడీపీకి నిర్దిష్టమైన ఆలోచనా విధానం లేదని.. ముందు అసెంబ్లీకి హాజరు కాబోమని చెప్పి ఇవాళ హాజరు అయ్యారని మండిపడ్డారు.

క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇప్పుడు వెనక్కు తీసుకున్నారని.. శాసనసభ, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికి ఆ అధికారం లేదని కోర్టు చెప్పలేదన్నారు. సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపై మాత్రమే కోర్టు వ్యాఖ్యానించిందని.. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధానమైన సూచన వికేంద్రీకరణ అన్నారు. 2024 వరకు రాజధాని హైదరాబాద్ మాత్రమే అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసన రాజధాని మాత్రమేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version