former Karnataka CM S M Krishna: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది.. మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1989-1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, 1993-94 మధ్య కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎంగా, 1999-2004 సమయంలో సీఎంగా, 2004-2008 వరకు మహా రాష్ట్ర గవర్నర్‌గా, 2009-2012లో విదేశాంగ మంత్రిగా SM కృష్ణ సేవలందించారు. ఇక కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూసిన నేపథ్యంలో.. ఆయనకు రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా, కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరిగే అవకాశం ఉంది.