త్వరలో సముద్రయాన్​.. మత్స్య-6000 జలాంతర్గామి ఫొటోలు చూశారా..?

-

చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్.. ఆ తర్వాత సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 శాటిలైట్​ను నింగిలోకి పంపింది. ఇక ఇప్పుడు సముద్రం సంగతి చూద్దామని సముద్రయాన్ పేరిట సాగర అన్వేషణకు సమాయత్తమవుతోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి ‘మత్స్య-6000’ తుది మెరుగులు దిద్దుకుంటోంది.

మత్స్య-6000’ సబ్‌మెరైన్‌ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(ట్విటర్​)లో పోస్టు చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన చెప్పారు. దీన్ని చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసింది.

మత్స్య-6000 ప్రత్యేకతలు ఇవే

  • ఇది ప్రారంభమైతే భారత మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది.
  • ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు.
  • సాగర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి అది ఉపయోగపడుతుంది.
  • తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version