రాజకీయాల్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఎంట్రీ!.. క్లారిటీ ఇదే

-

ఇటీవల బాలీవుడ్‌లో చాలా మంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వదంతులపై సంజయ్ దత్ స్పందించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తానే ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు.

64 ఏళ్ల సంజయ్‌దత్‌.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని కర్నాల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు పోటీగా ఆ స్థానం నుంచి సంజయ్‌ను బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతున్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఈ వదంతులపై తాజాగా సంజయ్‌ సమాధానం ఇచ్చారు. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తాననే వదంతులకు స్వస్తి పలకాలనుకుంటున్నా. ఏ పార్టీలోనూ చేరడం లేదు. దయచేసి ఈ అసత్య ప్రచారాన్ని నమ్మకండి’’ అంటూ రూమర్స్‌కి చెక్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version