15 రోజుల్లోపు లొంగిపోండి.. కొవిడ్‌ వేళ విడుదలైన ఖైదీలకు సుప్రీంకోర్టు ఆదేశం

-

కరోనా సమయంలో అన్ని శాఖలు, అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రద్దీని తగ్గించి.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేలా అన్ని రంగాలు తగిన చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే..  కరోనా ఉద్ధృతి వేళ జైళ్లలో రద్దీని తగ్గించేందుకు శిక్ష అనుభవిస్తోన్న దోషులు, విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, వారందరూ 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

మహమ్మారి సమయంలో అత్యవసర, మధ్యంతర బెయిళ్లపై విడుదలైనవారు ఈ మేరకు లొంగిపోవాలని జస్టిస్‌ ఎంఆర్ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లొంగిపోయిన అనంతరం విచారణ ఖైదీలు.. రెగ్యులర్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.  దోషులు లొంగిపోయిన తర్వాత.. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ, చట్టాలకు లోబడి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. కరోనా తీవ్రత దృష్ట్యా ‘సుప్రీం’ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు.. వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్థులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా వారందరూ లొంగిపోవాలంటూ సుప్రీం కోర్టు

Read more RELATED
Recommended to you

Exit mobile version