నిన్న ప్రపంచ వ్యాప్తంగా బక్రీద్ పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన పని మరోసారి నెట్టింట వివాదాస్పదంగా మారింది.
లక్షలు పెట్టి కొనుగోలు చేసిన అరుదైన జాతికి చెందిన ఎద్దును బక్రీద్ రోజున బలి ఇవ్వనున్నట్లు తెలపడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురయ్యారు. గతంలోనూ తన ఎన్జీవోకు వచ్చిన డబ్బులతో అరుదైన జాతులను కొనుగోలు చేసి వధించారు. కాగా, ఈ NGOకు భారత క్రికెటర్లు విరాళాలు ఇవ్వడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.