సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ : ఆ చిన్నారికి కృత్రిమ కాలు ..

-

సీమ నువ్వు గ్రేట్ అని చెప్పి ఊరుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్. ప్ర‌మాదవ‌శాత్తూ కాలు కోల్పోయిన ఆ చిన్నారిని ఉద్దేశించి ఆ వీడియో చూసి సోష‌ల్ మీడియాలో స్పందించారు. ఇప్పుడు ఆ చిన్నారికి ఓ కృత్రిమ కాలు అమ‌ర్చారు. మంచి ఫ‌లితాల‌కు సోష‌ల్ మీడియా కార‌ణం అయి ఉంది క‌దా అంటూ.. ఐపీఎస్ అధికారి స్వాతి ల‌క్రా ఆనందిస్తున్నారు. ఇది క‌దా మార్పు అంటే ! ఈ ఉద‌యాన ఇలాంటి చిన్నారుల‌కు ఇంకా మంచి మంచి సంద‌ర్భాలు ఎదురయి వీరి ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేయాల‌ని ప్రార్థించండి.

ఆదివారం ఉద‌యం ప్రార్థ‌న ఇలానే ఉండాలి.. మీ కోసం కాదు స‌ర్.. మీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించి చేసే ప్రార్థ‌న చూస్తే ప‌ర‌మాత్ముడు ఆనందిస్తాడు. ప్ర‌భువు ఆ చిన్నారిని మ‌రోసారి దీవెన‌లు అందించాల‌ని వేడుకోండి. మీ చుట్టూ ఉన్న ఏ కొద్ది పాటి చీక‌టి అయినా త‌రిమికొడితే మీరే ఈ దేశాన్ని న‌డిపే గొప్ప శ‌క్తులు అవుతారు. ఇది క‌దా కావాలి. ఈ ఆదివారం మీరు సాధించాల్సింది ఏమ‌యినా ఉందా వెత‌కండి..

మార్పు ఏద‌యినా గొప్ప‌ది. మ‌నుషులు వ‌చ్చి త‌మ‌ని తాము సంస్క‌రించుకోవ‌డంలో జీవితం గొప్ప విజ‌యాల‌ను అందుకుంటోం ది. ఆ దిశ‌గా ఎవ‌రు ఏ చిన్న ఆలోచన చేసినా జీవితాన్ని మ‌రో గొప్ప అవ‌కాశం వ‌చ్చి వ‌రించి ఉంటుంది. బిడ్డ‌ల చ‌దువు మాత్ర‌మే కాదు వారి సంక‌ల్పాన్ని కూడా ప్రోత్స‌హించాలి. ఒంటి కాలుతో ప‌రుగులు తీస్తున్న ఆ చిన్నారి క‌ష్టం క‌న్నీరు పెట్టించింది. కొంద‌రు మాట్లాడి ఊరుకున్నారు కొంద‌రు ప్రోత్స‌హించి మ‌నుషులం అని అనిపించుకున్నారు. ప్ర‌తి మంచి ప‌నికీ కొన్ని గొప్ప హృద‌యాలు అండ‌గా ఉంటాయి.

జేజేలు ప‌లికాక మ‌ళ్లీ మ‌రో ఉద‌యం మొద‌ల‌వుతోంది. ఆ ఉద‌యాన మళ్లీ మ‌రో మంచి పని మొద‌లువుతుంది. ఒంటి కాలుతో సాహ‌స యాత్ర చేసిన ఆ చిన్నారి క‌ష్టం ఇప్పుడు తీరిపోయింది. రేప‌టి నుంచి హాయిగా బ‌డికి పోవ‌చ్చు. ఆనందంగా చ‌దువుకుని ఇంటికి రావొచ్చు. ఇలాంటి పిల్ల‌ల న‌వ్వుల‌కు కార‌ణం అయిన పెద్ద‌లు ఎందురుంటే వాళ్లంద‌రికీ ఇవాళ మీరు థాంక్స్ చెప్ప‌డం మ‌రువ‌కండి. ఓ చిన్న చిర్న‌వ్వు కోసం ప‌రిత‌పించిన హృద‌యాల ద‌గ్గ‌ర మ‌నమంతా చిన్న‌వారం.

కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు మ‌హా పురుషులవుతారు అని అన్నారు సినీక‌వి వేటూరి. ఆ మాట‌కు నిద‌ర్శ‌నంగా చిన్నారి సీమా ప్ర‌య‌త్నం ఉంది. బ‌డికి వెళ్లేందుకు ఈ పాప ప‌డిన పాట్లు అంద‌రినీ క‌దిలించాయి. ఒంటికాలుతో నడుస్తూ ఆ పాప చేసిన ప్ర‌య‌త్నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బీహార్ కు చెందిన ఈ బుజ్జాయి కృషి ఫ‌లించింది. ఆమెకు ఇప్పుడు ప్రొస్థ‌టిక్ కాలును అమ‌ర్చారు. ట్రై సైకిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడీ ఈ బుజ్జాయి ఫొటోలు మ‌ళ్లీ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఐపీఎస్ అధికారి స్వాతి ల‌క్రా ఈ చిన్నారి ఫొటోలు షేర్ చేసి, ట్విట‌ర్ వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version