తమిళనాడులో కల్తీసారా తాగి 12 మంది మృతి

-

కల్తీ సారా, కల్తీ కల్లు, కల్తీ మద్యం.. ఇలా కల్తీ పానీయాలు సేవించి ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఒడిశా, బిహార్, ఏపీ వంటి రాష్ట్రాల్లో కల్తీ మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు. ఇప్పుడు తాజాగా తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. దాదాపు 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

విళుపురం జిల్లా మరక్కాణం ప్రాంతానికి చెందిన అమరన్‌ సముద్ర తీరంలో ఉన్న వంబామేడు ప్రాంతంలో సారా విక్రయిస్తుంటాడు. అతడి వద్ద ఎక్కియార్‌కుప్పం జాలరి గ్రామానికి చెందిన కొందరు ఆదివారం సారాయి తాగారు. వారిలో చాలా మంది ఇంటికి వెళ్లిన వెంటనే స్పృహ కోల్పోయారు.  వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుల్లో కొంత మంది చికిత్స పొందుతూనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version