గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

-

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి జరిగింది. సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తన స్నేహితురాలు నికోల్ ను పెళ్లాడు. పదేళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరికీ గతేడాది నిశ్చితార్థం జరిగింది.

శనివారం సెంచూరియన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బంధువులు, స్నేహితుల మధ్య వివాహం జరగ్గా, ఫోటోలను ఇన్స్టా లో పోస్ట్ చేశారు. ఐపీఎల్ 2023లో తొలిసారిగా సన్రైజర్స్ కెప్టెన్ గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించాడు.

ఇది ఇలా ఉండగా, గత రెండేళ్లు గా ఐపీఎల్‌ లో దారుణంగా విఫలమౌవుతూ వస్తోంది హైదరాబాద్‌ జట్టు. దీంతో ఐపీఎల్‌ 2024 టోర్నమెంట్‌ కోసం.. కీలక మార్పులు చేయాలని భావిస్తోంది ఓనర్‌ కావ్యా మారన్‌. ఇందులో భాగంగానే.. కోచ్‌ గా ఉన్న లారాను తప్పించి.. సెహ్వాగ్‌ తీసుకోవాలని భావిస్తున్నారు.  కాగా ఇంతకు ముందు సెహ్వాగ్ ఢిల్లీ , పంజాబ్ జట్లకు ఆడాడు.. మరియు పంజాబ్ కు కోచ్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version