గణేశుడి సన్నిధిలో సన్నిలియోన్.. నెటిజన్స్ కామెంట్స్..!

-

సన్నిలియోన్ దాదాపు అందరికీ సుపరిచితమే. వెండి తెరపై పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ ఆమెకు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. తాజాగా ఈ బ్యూటీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొంది. ముంబైలోని లాల్ బాగ్ వద్ద గణేశుడి మండపానికి భర్త డానియల్ వెబర్ తో కలిసి వెళ్లి పూజలు చేసింది. ఆమెను చూసేందుకు జనాలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓవైపు వర్షం పడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లి బొజ్జ గణపయ్యను ఆమె దర్శించుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సన్నీలియోన్ ఎక్కడ ఉన్న భారతీయ మూలాలు ఉన్న స్త్రీ కాబట్టి ఆమెలో దైవ భక్తి ఉందని నెటిజన్స్ తెలుపుతున్నారు. తనకు ఊహ తెలియని సమయంలో తప్పులు చేశానని సన్నిలియోన్ గతంలో ఇలా చేసింది. “నేను చేసిన కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల తలదించుకుంటున్నాను. భారతీయ మూలాలు తనలో ఉండటం వల్లనే నేను ఇలా ఆలోచిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది సన్నీలియోన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version