లఖింపుర్‌ ఖేరి కేసులో ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌

-

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీ దుర్ఘటన కేసులో కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్రా కుమారుడు ఆశిశ్​ మిశ్రాకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది. 8 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్​ను సుప్రీంకోర్టు బుధవారం మంజూరు చేసింది. ఈ బెయిల్​ వ్యవధిలో ఆశిశ్​.. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​లో ఉండరాదని.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

లఖింపుర్​ ఖేరీ హింస కేసులో మిశ్రా బెయిల్ పిటిషన్‌ను ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్​ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆశిశ్​ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు తనకు బెయిల్​ ఇవ్వాల్సిందిగా నిందితుడు ఆశిశ్​ మిశ్రా వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యంత దారుణంగా కారాగారంలో మగ్గుతున్న బాధితులు రైతులేనని.. ఆశిశ్​ మిశ్రాకు బెయిల్​ మంజూరు చేయకపోతే, వారు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version