సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుందా..? అరకు, సింహాచలం విశాఖపట్నం అన్నీ ఈ టూర్ ప్లాన్ తో చూసేయచ్చు..!

-

శీతాకాలంలో మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? శీతాకాలంలో ఆంధ్రా ఊటీ అరకు వెళితే ఎంతో బాగుంటుంది. ఎక్కువ మంది వెళ్తూ వుంటారు కూడా. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇక్కడకి వెళ్లేందుకు బాగుంటుంది. వైజాగ్ రీట్రీట్ అని ఓ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు.

మరి ఐఆర్‌సీటీసీ ఇస్తున్న టూరిజం ప్యాకేజీ వివరాలని చూసేద్దాం.’వైజాగ్ రీట్రీట్’ అనే ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మీరు ఈ టూర్ లో భాగంగా అరకు, సింహాచలం, విశాఖపట్నం చూసి వచ్చేయచ్చు. ఇది విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతుంది. కనుక స్థానికులు ఈ టూర్ ప్యాకేజీ ని బుక్ చేసుకోవచ్చు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో టూరిస్టులని రిసీవ్ చేసుకుంటారు.

హోటల్‌లో చెకిన్ అయ్యాక తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, రుషికొండ చూసి రావచ్చు. భోజనం చేసాక కైలాసగిరి, సబ్‌మెరైన్ మ్యూజియం, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ ని చూసి రావచ్చు. రాత్రికి వైజాగ్‌లోనే స్టే చేయాలి. రెండో రోజు ఉదయం అరకు వెళ్లాల్సి ఉంటుంది. దారిలో జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం ని చూడొచ్చు.

మధ్యాహ్నం అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలని చూసి రావచ్చు. రాత్రికి విశాఖపట్నంలో స్టే చేసి మూడో రోజు ఉదయం సింహాచలం చూసాక ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో డ్రాప్ చేస్తారు. ఇక దీని ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,985, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,835, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,380 గా వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version