ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు చట్టవిరుద్ధం : సుప్రీంకోర్టు

-

ఈడీ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రను సాగనంపాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఆయన పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆయన ఈ నెల 31 వరకు మాత్రమే ఆ పదవిలో ఉండేలా పరిమితి విధించింది. అంతర్జాతీయ వ్యవహారాలతో ముడిపడిన ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) సమీక్ష ఉందని ప్రభుత్వం తెలియజేయడంతో ఈ నెల 31వరకు ఎస్‌.కె.మిశ్ర ప్రస్తుత పదవిలో కొనసాగేందుకు అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. కొత్త సంచాలకుడి నియామకానికి కొంత సమయం పడుతుందనే ఉద్దేశంతోనూ నెలాఖరు వరకు గడువునిచ్చినట్లు వివరించింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఎస్‌.కె.మిశ్ర పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన చివరి ఉత్తర్వు ప్రకారం ఆయన ఈ ఏడాది నవంబరు 18 వరకు ఈడీ సంచాలకుడిగా కొనసాగాల్సి ఉంది. తాజా తీర్పు నేపథ్యంలో ఈ నెలాఖరుకు ఆ పదవి నుంచి ఎస్‌.కె.మిశ్ర వైదొలగాల్సి ఉంటుంది. మిశ్ర పదవీ కాలాన్ని మరోసారి పొడిగించవద్దంటూ 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కేంద్రం ఉల్లంఘించిందని ధర్మాసనం ఆక్షేపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version