నేడు కేంద్ర కేబినెట్ సమావేశం..వీటిపైనే చర్చ

-

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించనున్నారు. ప్రగతి మైదాన్ లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఇక ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇవాళ తిరుపతి జిల్లాకు రానున్నారు. 13న ఉదయం తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కృష్ణపట్నం పోర్టు రహదారులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేసి డీకే బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో కేంద్రమంత్రి పర్యటనపై జిల్లా అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version