బెంగాల్‌లో టీచర్ నియామకాలపై కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

-

పశ్చిమ బెంగాల్‌లో 25,753 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర  నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు కొనసాగించాలని సీబీఐకి సూచించింది. కేబినెట్‌ మంత్రులపై కూడా విచారణ చేయాలని పేర్కొంది.

అయితే విచారణ సమయంలో అనుమానితులను అరెస్ట్‌ చేయొద్దని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది. 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్‌ సర్కారు రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహించగా.. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే… బెంగాల్‌ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఖాళీల సంఖ్య కంటే ఎక్కువ మందికి అపాయింట్‌మెంటు లెటర్లు ఇవ్వటం వివాదాస్పదమైంది. దీంతో కోల్‌కతా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version