అయోధ్య బాలరాముడికి 101 కిలోల బంగారం కానుక

-

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు రకాల కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రామ్ లల్లాకు కానుకలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాల రాముడికి దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు అందజేస్తున్నారు. రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందంజలో ఉంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు సమాచారం.

ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం, పిల్లర్లకు కేటాయించినట్లు తెలిసింది. ప్రస్తుత మార్కెట్‌లో బంగారం 10 గ్రాములు రూ.68వేలుగా ఉండగా.. ఆ లెక్కన రామాలయానికి లాఖి కుటుంబం రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని సమాచారం. ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపూ రూ.11.3 కోట్లు.. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు మరో రూ.8 కోట్లు సమకూర్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version