తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజ్

-

తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్‌ కళాశాలగా మార్చనున్నారు. ఈ పాలిటెక్నిక్‌ను అప్‌గ్రెడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా.. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇక్కడ ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ కళాశాలలో మూడు బీటెక్‌ బ్రాంచీలు (180 సీట్లు) బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌), సీఎస్‌ఈ (డేటా సైన్స్‌) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు ఇంజినీరింగ్‌ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కోస్గి పాలిటెక్నిక్‌ కళాశాలను 2014లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించగా సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ బ్రాంచీలు (180 డిప్లొమా సీట్లు) విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా బీటెక్‌ బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కోర్సులకు ఉన్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version