స్పీకర్​గా పదేళ్లు పూర్తిచేసుకుంటారని ఆశిస్తున్నా: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

-

18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. ఈరోజు (జూన్ 26వ తేదీ) జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా లోక్​సభ సభ్యులు ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ తరఫున ఓం బిర్లాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి సభాపతిగా ఎన్నిక కావడం అరుదైన విషయం అని అన్నారు. సభాపతిగా పదేళ్లు పూర్తిచేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో సభను విజయవంతంగా నడిపించారని చెప్పారు. లోక్‌సభ ప్రొసీజర్స్‌ను డిజిటలైజ్‌ చేసిన ఘనత మీదని ఓం బిర్లాను కొనియాడారు. మరోవైపు ఎంపీ అఖిలేశ్‌ యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్‌ అన్ని పక్షాలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. జనవాణి వినిపించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభా అధ్యక్ష స్థానం చాలా ఎత్తులో ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version