ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరుగనుంది. ఈ ఏడాది భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగునున్నది. ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది.
టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ నిన్న ప్రత్యేక గీతంతో కూడిన వీడియోను రిలీజ్ చేసింది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిసారు.
వాస్తవానికి టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ గా ఆడిడాస్ వచ్చాక మూడు ఫార్మాట్లలో జెర్సీలను మార్చింది. టీ20లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్ తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్టుల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ రూపొందించింది.