తెలంగాణలోకి ఆ వైరస్‌ ..?

-

బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్త తరహా వైరస్‌తో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆయా రాష్ట్రాలు తగు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి యూకే, తదితర ప్రాంతాల నుంచి సుమారుగా 3 వేల మంది ప్రయాణికులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే రెండు వారాలుగా నేరుగా రాష్ట్రానికి 355 మంది తెలంగాణ వచ్చినట్లు గుర్తించి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.కాగా.. వారిలో కొత్త తరహా వైరస్‌ ఉందా.. లేదా అని గుర్తించేందుకు నమూనాలను పుణె ప్రయోగశాలకు పంపించినట్లు ప్రజా ఆరోగ్య చాలకులు డా. శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

corona person

జాగ్రత్తలు చాలా అవసరం..

యూకేలో వణికిస్తున్న కొత్త తరహా వైరస్‌ వేగంగా వస్తరిస్తుందని ప్రస్తుతమున్న దాని కన్న రెట్టింపు వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే రానున్న పండగలను కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించే జరపుకోవాలని వారు సూచించారు. గతేడాది నుంచి కరోనా కాలంగా అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కాస్త ఊరట కల్గుతుందని. పండగల నేపథ్యంలో గుంపులు, గుంపులుగా చేరి వైరస్‌ వ్యాప్తికి కారకులు కారాదన్నారు.

మన చేతుల్లోనే..

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మన చేతుల్లోనే ఉందని డీఎంఈ డా. రమేష్‌ రెడ్డి సూచించారు. ఇప్పుడిప్పుడే తగ్గుతున్న నేపథ్యంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కరోనా వ్యాప్తి ప్రారంభం అయిందంటే.. దాన్ని అదుపు చేయడం కష్టం. కొత్తరకం వైరస్‌ మన దేశంలో రాలేదు. ఒకవేళ ఉన్నట్లు గుర్తించినా వారికి ప్రత్యేక చికిత్స కోసం ఆస్పత్రులు సిద్ధం చేశాం. గతంలో అందించిన చికిత్సనే కొత్తవైరస్‌ బాధితులకు అందిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version