తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారం ఇంకా తేలలేదు. ఏపీలో ప్రభుత్వమే బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తుండగా తెలంగాణలో అది కూడా లేదు. తాజగా ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ సంస్థ చైర్మన్ అలానే ముగ్గురు డైరెక్టర్ లను అరెస్ట్ చేశారు. వీరంతా కలిసి రూ. 6,400 కోట్లు స్కామ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని అధికారులు గురితించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది. దానికి తగ్గట్టు ఏపీ ప్రభుత్వం కొంత మేర బాధితులకు అమౌంట్ తిరిగి చెల్లించింది కూడా.