రోజు రోజుకు దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు కామాంధుల చేతిలో అమ్మాయిలు, మహిళలు బలవుతున్నారు. మరోవైపు మహిళా కామాంధుల వల్ల కూడా మైనర్ బాలురు బలవుతున్నారు. ఇలాంటి ఘటనలు మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఇది విన్న వారు చాలా మంది ఆశ్చర్యపోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా వెస్ట్ బెంగాల్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ముఖ్యంగా మైనర్ మేనల్లుడిని అత్యాచారం చేసింది అత్త. పశ్చిమ బెంగాల్‌లోని పరగణా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలుడి పై అత్యాచారం చేయడమే గాక వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసింది. జరిగిన విషయాన్ని బాలుడు తల్లికి చెప్పుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కామం అనేది ఆడ, మగ అని తేడా లేకుండా పోయిందనే చెప్పాలి. ఇలాంటి కామానికి అడ్డుకట్ట వేయకపోతే ఇంకా చాలా మంది బలవుతారనే చెప్పవచ్చు.