ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే కేటీఆర్ ను పొగిడినట్టు ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి షాక్ ఇచ్చాడు దానం నాగేందర్.
ఇతర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తరహాలో మౌనంగా ఉండకుండా.. తన ఇలాకాలో జరుగుతున్న కూల్చివేతల్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తిరిగొచ్చేదాకా కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేసాడు. ఒకవేళ కూల్చివేతలు ఆపకపోతే.. తాను ఆందోళన చేస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం విశేషం. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయడమేంటని కొందరూ ఆశ్చర్యపోతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్నాడా..? లేక బీఆర్ఎస్ లో ఉన్నాడా..? అనే సందిగ్ధంలో ఉన్నారు.