రామ జన్మభూమి అయోధ్యలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతిపై అత్యాచారం చేసి.. ఆపై ఆమె మీద రాక్షసత్వం ప్రదర్శించారు కొందరు దుర్మార్గులు. ఇటీవల భాగవతం విని.. ఇంటికి బయలుదేరిన 22 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి.. ఆపై ఆమె మీద దారుణానికి పాల్పడ్డారు. మార్గమధ్యంలో అడ్డుకొని.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు.
అత్యాచారం చేయడమే కాకుండా.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. కళ్లు కూడా పీకేసి.. మర్మావయాల్లో కర్ర దూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ బాధితురాలికి న్యాయం చేస్తానని ఫజియాబాద్ ఎంపీ అవధేశ్ ప్రమాణం చేశారు. మరి దీనిపై బీజేపీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.