దేశంలో జనాభా నియంత్రణ అవసరం లేదు – అసదుద్దీన్ ఓవైసీ

-

జనాభా విస్ఫోటనం వల్లే మతపరమైన సమతుల్యత దెబ్బతిన్నదని, దీన్ని తగ్గించేందుకు జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మైనారిటీలకు ప్రమాదం లేనేలేదని అన్నారు. మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

హిందూ రాష్ట్రం అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మనదేశంలో ప్రస్తుతం జనాభా నియంత్రణ పాలసీలు అవసరం లేదని ట్వీట్ చేశారు. ఇప్పుడు దేశంలో ఉన్న సమస్య ఏమిటంటే వృద్ధుల జనాభా పెరుగుతోందని.. నిరుద్యోగ యువత ఆ వృద్ధులను సరిగ్గా చూసుకోవడం లేదని అన్నారు. ముస్లింలలో అయితే జనాభా పెరుగుదల బాగా వేగంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version