ఇది ఆర్మీ విద్యార్థుల పని కాదు.. ఖచ్చితంగా వారి పనే: బండి సంజయ్

-

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ కి వెళుతుండగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ చేశారు పోలీసులు. బిక్కనూరు ప్రాంతంలో అరెస్టు చేసి కామారెడ్డి కి బండి సంజయ్ ని తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది ఆర్మీ అభ్యర్థుల పని కాదని.. వాళ్లకి ఈ ఇష్యుతో సంబంధమే లేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. విద్యార్థుల ముసుగులో ఈ విధ్వంసానికి పాల్పడ్డారు అని ఆరోపించారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కూడా కాదని.. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు బండి సంజయ్. టీఆర్ఎస్, ఎంఐఎం గూండాలు మాస్కులతో వచ్చి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు అని అన్నారు. ఆర్మీ విద్యార్థులను మోసం చేసే వ్యక్తి మోడీ కాదని అన్నారు. ఆర్మీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆర్మీ అభ్యర్థులను కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలు పట్టించుకోవద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version