అలా కాకపోతే సెప్టెంబర్‌ 15నుంచి అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌ : ట్రంప్‌

-

చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దాంట్లో టిక్‌టాక్‌ వీడియో షేరింగ్‌ యాప్‌ కూడా ఉంది. అయితే టిక్‌టాక్‌ను త్వ‌ర‌లో అమెరికాలో కూడా బ్యాన్ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో.. చైనా యాప్ టిక్‌టాక్‌ను సెప్టెంబర్ 15 నుంచి అమెరికాలో నిషేధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒకవేళ టిక్‌టాక్‌ను ఏదైనా అమెరికా సంస్థ కొనుగోలు చేసి, లావాదేవీలన్నీ ఆ సంస్థనుంచే జరిగితే మాత్రం బ్యాన్‌ ఉండదంటూ తెలిపాడు.

Trump

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు గాను టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో మైక్రోసాఫ్ట్ చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. అయితే 30 శాతం వాటా కాకుండా పూర్తిగా టేకోవర్‌ చేసుకునేలా చర్చలు జరపాలని ట్రంప్‌ చెప్పారు. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెల్లతో మాట్లాడినట్లు ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఒకవేళ మైక్రోసాఫ్ట్‌ కంపెనీ టిక్‌టాక్‌ మొత్తాన్ని కొనుగోలు చేస్తే ఆ యాప్‌ను భార‌త్‌లో తిరిగి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version