BREAKING : కేరళలో రాహుల్ గాంధీకి చికిత్స !

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 29 వరకు అక్కడే ఉండనున్నారు. రాహుల్ వెంట కేసి వేణుగోపాల్ ఉంటారు. జోడోయాత్ర సందర్భంగా కాళ్లకు నొప్పులు వచ్చినట్లు గతంలో తెలిపారు. నొప్పులకు వైద్యం తీసుకుంటున్నారా? మరేదైనా ఆరోగ్య సమస్య అనేది తెలియదు. ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా, ప్రతిపక్ష నేతల కూటమి ఆగస్టు 15 తర్వాతే భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 11 మందితో కూడిన కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కానుంది. దీనితో పాటు ప్రచార కమిటీ, కమ్యూనికేషన్ సహా నాలుగైదు కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటీవల బెంగళూరులో ప్రతిపక్ష నేతలు కూటమిగా ఏర్పడి సమావేశమైన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version