ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..త్వరలోనే IIITలో 650 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని RGUKT పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో 650 రెగ్యులర్ పోస్టులను నవంబర్ లోగా భర్తీ చేస్తామని వర్సిటీ కులపతి ఆచార్య కేసిరెడ్డి తెలిపారు.
ఇందులో 400 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 250 లెక్చరర్స్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఇడుపులపాయలో ఆయన మాట్లాడుతూ… ఈ ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులకోసం 6,500 ల్యాప్ టాప్ లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
కాగా, పదేళ్లలో AP అద్భుతమైన ప్రగతి సాధించిందని నీతి అయోగ్ కొనియాడింది. రాష్ట్రంలో పేదరికం 11.77% నుంచి 6.06 శాతానికి తగ్గిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పురోగతి మరింత అద్భుతంగా ఉందని, అక్కడ పేదరికం 14.72% నుంచి 7.71 శాతానికి తగ్గిందని పేర్కొంది. వంటగ్యాస్ లేని వారి సంఖ్య 37.90% నుంచి 16.09 శాతానికి తగ్గిందని చెప్పింది. మాత, శిశు సంరక్షణ, శానిటేషన్, హౌసింగ్, విద్యలోను ప్రగతి సాధించినట్లు తెలిపింది.