ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలాక్ మస్క్ చేతిలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు మస్క్. ఆదాయం పెరగడం సంగతి అలా ఉంచితే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని ట్విట్టర్ వర్గాలు తలపట్టుకున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ట్విట్టర్ లో ఇప్పటివరకు కనిపించిన పిట్టబొమ్మ స్థానంలో యూజర్లకు తాజాగా ఓ కుక్క బొమ్మ కనిపిస్తోంది. ఇలా జరగడానికి ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్కే కారణం. ట్విట్టర్ ను కొనాలని, దాని లోగోను బర్డ్ బొమ్మ నుంచి డాగ్ కు మార్చాలని ఓ యూజర్ చేసిన విజ్ఞప్తితో మస్క్ ఇలా డాగ్ బొమ్మ కనిపించేలా మార్పులు చేయించారు. ‘ఇచ్చిన హామీ ప్రకారం’ అంటూ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.