ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఆదేశంలో చిక్కుకుపోయిన దాదపు 20 వేలకు పైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఈ యుద్ధం వల్ల అనుకోని విధంగా కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణించారు. మార్చి1న ఖార్కీవ్ లో రష్యా జరిపిన క్షిపణి దాడిలో మరణించారు. ఆహారం కోసం బయటకు వెళ్లిన సందర్భంలో దాడి జరగడంతో నవీన్ మృతి చెందారు.
తాజాగా ఆయన మృతదేహం ఇండియాకు చేరుకుంది. బెంగళూర్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు. నవీన్ చనిపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. భౌతిక కాయాన్ని తీసుకురావడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే నవీన్ మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తానని ఆయన తండ్రి ప్రకటించారు.