ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రకటించిన కేంద్రం…!

-

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రకటించింది కేంద్రం. ఈ పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన చేయనున్నట్లు వివరించారు. ఒక కోటీ 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. ఇక అటు కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో తీపికబురు అందించింది కేంద్ర సర్కార్‌.

Union Finance Minister Nirmala Sitharaman says, “PM Dhan Dhaanya Krishi Yojana

కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచింది మోదీ సర్కార్. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పటివరకు 3 లక్షల రూపాయల రుణం అందిస్తుండగా ఇకపై ఆ మొత్తం 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా రైతులకు ఎక్కువ మొత్తంలో రుణం లభించనుందని తెలిపారు నిర్మలా సీతారామన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version