కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటకు వార్షిక బడ్జెట్ (2025-26)ను ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి పద్దును చదువుతుండగా ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారి జాబితాను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా యూపీలోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్చ జరపాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో సహా ఆ పార్టీలు ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళనల మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్దులను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.