మహారాష్ట్రలో కేంద్ర మంత్రి అమిత్ షా హెలికాప్టర్ తనిఖీ

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రచారంలో పాల్గొనే పలువురు నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

Helicoptor Amith Sha
Helicoptor Amith Sha

 

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తన హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేసినట్టు తెలిపారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఇందుకు మనమంతా సహకరించాలి. ప్రపచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలని అమిత్ షా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version