రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతు భరోసా : మంత్రి పొంగులేటి

-

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతు భరోసాను ఒక కిస్తిలోనే చెల్లిస్తామని రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఇవాళ మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల కనుసైగలలో వారి స్వార్థ్యం కోసం నిస్వార్థంతో పని చేసే ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏం మాట్లాడారో చూశామని.. భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు. కలెక్టర్ ను చంపాలని రెచ్చగొట్టారని ఆరోపించారు.

పింక్ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే తీసినట్టు అంతా బయటికి తీస్తుందన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని.. గత ప్రభుత్వ నాయకుల్లా కాదు.. ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనేది మా ప్రభుత్వ చిత్తశుద్ది అన్నారు. సగం కట్టి వదిలేసిన ఇండ్ల పై రివ్యూ చేస్తామని.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు. డిసెంబర్ లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version