ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్‌గా మార్చబోతోందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం కూడా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇండియా పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది దీన్ని సమర్థిస్తుంటే.. మరికొంత మందేమో విమర్శిస్తున్నారు.
ఇక ప్రతిపక్షాలు మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం వల్ల భయపడి.. ఇలా మార్పు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణం లోనే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇండియా పేరు భారత్‌గా మారుస్తారు అనేది పుకారు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొంత మంది ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.