మల్లన్న పార్టీ..ఎవరి కోసం?

-

తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో లెక్క లేదనే చెప్పాలి. ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో మరొక పార్టీ ఏర్పాటుకు తీన్మార్ మల్లన్న రెడీ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హైలైట్ అయిన మల్లన్న..ఆ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి బి‌ఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. అప్పటినుంచి మల్లన్న కాస్త హైలైట్ అయ్యారు.

రాజకీయంగా ఇంకా బి‌ఆర్‌ఎస్‌ని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. మధ్యలో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. అలాగే ఆయన రాజకీయంగా బలోపేతం కావడానికి బి‌జే‌పిలోకి వెళ్లారు. ఎందుకో గాని కొన్ని రోజులు ఉండి..ఆ పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ సొంతంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో ఆ మధ్య రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ నిర్మాణ పార్టీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక మల్లన్న కొత్త పార్టీ దాదాపు రెడీ అయిపోయినట్లే. సరే ఇప్పటికే తెలంగాణలో పలు పార్టీలు ఉన్నాయి. మరి ఇప్పుడు మల్లన్న పార్టీ ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీ సత్తా చాటడం కష్టం. అలాగే మల్లన్న పోటీ చేసే నియోజకవర్గంపై చర్చ నడుస్తోంది. అలాగే ఎన్ని సీట్లలో ఆయన పార్టీ పోటీ చేస్తుందనేది క్లారిటీ లేదు. ఒకవేళ పోటీ చేసిన కొంత మేర ఓట్లు సాధిస్తారు తప్ప..గెలిచే అవకాశాలు లేవు. అంటే ఓట్ల చీలిక జరుగుతుంది. ఓట్లు చీల్చి మల్లన్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ చేయాలని చూస్తున్నారనే అంశం కూడా తెరపైకి వస్తుంది. చూడాలి మరి మల్లన్న పార్టీ ఎలా ముందుకెళుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version