లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ… ఈ బిల్లు రూపకల్పన కోసం రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, మతపెద్దలు, మేధావుల నుంచి అభిప్రాయ సేకరణ చేశామన్నారు. గతంలో ఏ బిల్లుకు ఇంత పెద్ద కసరత్తు జరగలేదని చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు.
అయితే ఈ బిల్లు లోక్సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎంపీలందరికీ బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. నేటి నుంచి మూడు రోజులపాటు సభకు హాజరుకావాలని బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆదేశాలు ఇచ్చాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లు సవరణపై చర్చ ప్రారంభమవుతుంది.
లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు
ఈ బిల్లు రూపకల్పన కోసం రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, మతపెద్దలు, మేధావుల నుంచి అభిప్రాయ సేకరణ చేశాం
గతంలో ఏ బిల్లుకు ఇంత పెద్ద కసరత్తు జరగలేదు
– కిరణ్ రిజుజు https://t.co/H6BaVWUm0T pic.twitter.com/ZtLdkAfIgA
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2025