రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ కొంపలు ముంచుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ పెడుతూ లక్షల కోల్పోతున్నారు యువకులు. తాజాగా బెట్టింగ్ యాప్ వాళ్లకు చిక్కుకున్న నిజామాబాద్ యువకుడు… బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూరులో ఆకాష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
ఈ తరుణంలోనే చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందడం జరిగింది. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ బెట్టింగ్ కు పాల్పడిన ఆకాష్…. బెట్టింగ్ యాప్ లో దాదాపు 5 లక్షల వరకు పోగొట్టుకున్నాడట. దీంతో డబ్బులు పోగొట్టుకున్నానని.. ఆందోళన చెందుతూ.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.