ఇక నుంచి వాట్సాప్ కి సుప్రీం కోర్టు కేసుల అప్డేట్స్..!

-

సుప్రీంకోర్టు ఇక నుంచి కీలక సమాచారం ఇవ్వనుంది. ఇప్పటి పలు కేసుల కి సంబంధించి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం లేదా మొబైల్ కి సందేశం పంపించడం వంటివి జరిగేవి. తాజాగా టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేయడంతో ఇక నుంచి వాట్సాప్ కి పలు కేసుల సంబంధించిన సమాచారాన్ని అప్ డేట్ ఇవ్వనుంది సుప్రీం కోర్టు.

ప్రధానంగా పిటీషనర్లు, అడ్వకేట్లు తమ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ ను వాట్సాప్ ద్వారా లేదా వ్యక్తి గతంగా మెసెజ్ రూపంలో పొందవచ్చని సుప్రీంకోర్టు సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేేసులకు సంబంధించిన అప్ డేట్స్ ఇలా వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపించడం..న్యాయ వ్యవస్థ పై మంచి ప్రభావం చూపుతుందన్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో వెబ్ సైట్లో అందుబాటులో ఉండే ఉత్తర్వులు.. తీర్పులు ఇక పై వాట్సాప్ ద్వారా కూడా అందుతాయని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version