ఇక నుంచి వాయిస్‌ యాక్సెస్‌ ద్వారా UPI చెల్లింపులు!

-

డిజిటల్‌ చెల్లింపుల్లో మరో కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌తో పిన్‌ ఎంటర్‌ చేసి లావాదేవీలు చేసేవాళ్లం కదా. ఆ తర్వాత యూపీఐ లైట్‌తో పిన్‌ అవసరం లేకుండానే చెల్లింపులు చేస్తున్నాం కదా. ఇక నుంచి ఇది కూడా లేకుండా జస్ట్ వాయిస్ యాక్సెస్​తో పేమెంట్ చేయొచ్చు. ఈ కొత్త పేమెంట్‌ విధానాలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.

‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2023’లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వీటిని ఆవిష్కరించారు. UPI, UPI లైట్ X, ట్యాప్ అండ్‌ పే, సంభాషణ ద్వారా చెల్లింపుల కోసం హలో! UPI, బిల్‌పే కనెక్ట్‌.. పేరుతో మొత్తం ఐదు పేమెంట్‌ విధానాలను తీసుకొచ్చినట్లు శక్తికాంత్‌దాస్‌ తెలిపారు. వీటితో డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత సులభం కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ అవసరం. ఇకపై ఇంటర్నెట్‌ సౌకర్యం లేనిచోట ఆఫ్‌లైన్‌లోనూ లావాదేవీలు జరిపేందుకు ఈ యూపీఐ లైట్‌ ఎక్స్‌ (UPI LITE X) పేమెంట్‌ విధానం ఉపయోగపడుతుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version