దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం

-

డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులకు షాక్. దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఎదురైనట్లు తెలిసింది. ఈ మేరకు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

యూపీఐ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల నగద ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయినట్లు తెలిసింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై సదరు సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా ఈ సేవలు పునరుద్ధరించాలని యూజర్లు కోరుతున్నారు. రీస్టోరీ యూపీఐ సర్వీసెస్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మోదీ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత భారతదేశంలో డిజిటల్ లావాదేవీల హవా పెరిగింది. ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంచుకునే వారు.. ఇప్పుడు రూపాయి చాక్లెట్ కొనాలన్నా.. పది రూపాయల కొత్తిమీర కట్ట కొనుగోలు చేయాలన్నా డిజిటల్ పేమెంట్ ద్వారానే చెల్లిస్తున్నారు. బడాబడా ధనవంతుల నుంచి కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారుల వరకూ అందరూ ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపులపైనే ఆధారపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version