దాదాపు సంవత్సర కాలం పాటు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్న తెలిసిందే. రైతుల నిర్విరామ పోరాట ఫలితంగా శుక్ర వారం రోజు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. అయితే ప్రధాని మోడీ ప్రకటన తర్వాత ఏం చేద్దాం అని సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో సాగు చట్టాలు రద్దు అయ్యాయి.. కాబట్టి భవిష్యత్తు పోరాట ప్రణళిక పై చర్చించే అవకాశం ఉంది.
అలాగే ఈ మూడు సాగు చట్టాలను పూర్తి గా రద్దు చేశారని స్పష్ట మైన ఆదేశాలు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఇప్పటికే రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. అలాగే మళ్లి ఎట్టి పరిస్థితుల లో సాగు చట్టాలను తీసుకురామని కేంద్రం స్పష్ట మైన హామీ ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన లు కొనసాగుతాయని రైతు సంఘాలు స్పష్టం చేశారు.