ఇరాన్‌తో డీల్‌ నేపథ్యంలో భారత్‌కు అమెరికా వార్నింగ్‌..!

-

భారత్‌, ఇరాన్‌ మధ్య తాజాగా చాబహార్‌ పోర్టు నిర్వహణకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. ఈ డీల్పై స్పందిస్తూ అమెరికా భారత్ను పరోక్షంగా హెచ్చరించింది. ట్రెహాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలకు వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్ మీడియాతో మాట్లాడుతూ .. టెహ్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై న్యూదిల్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

అయితే ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని, వాటి అమలు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏ సంస్థ అయినా, దేశమైనా టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే.. వారు కూడా ఆంక్షల ఛట్రంలో పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మరోవైపు మధ్య ఆసియా దేశాలతో భారత్‌ వాణిజ్యం నెరపడానికి చాబహార్‌ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. కజకిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలకు భారత్‌ నుంచి సరకు రవాణా చేయవచ్చు. వ్యూహాత్మకంగానూ అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో 10ఏళ్ల పాటు టర్మినెల్‌ నిర్వహణ కోసం భారత్‌, ఇరాన్‌ సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version