రెస్క్యూ ఆపరేషన్​లో కీలక అడుగు.. మరో 5 మీటర్ల దూరంలోనే కూలీలు

-

ఉత్తరాఖండ్‌లోని  సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది గంటల్లో కార్మికులను బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది సహాయక చర్యల్లో కీలక అడుగు పడింది. కార్మికులను చేరుకునేందుకు చేపట్టిన తవ్వకాల పనులు ఇప్పటి వరకు 52 మీటర్ల మేర పూర్తయ్యాయి.

మరో 5 మీటర్ల మేర పనులు పూర్తయితే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు.  నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లు తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. వారు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారని.. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ఇవాళ  సాయంత్రానికి రెస్క్యూ పనులు కీలక దశకు చేరుకునే అవకాశముందని సమాచారం. మరోవైపు కొండ పైభాగం నుంచి చేపట్టిన వర్టికల్ డ్రిల్లింగ్‌ పనులు ఇప్పటికే 42 మీటర్లు పూర్తయ్యాయి. నిట్టనిలువుగా 86 మీటర్లుండగా.. ఇందులో దాదాపు సగం పని పూర్తయినట్లు సహాయక  సిబ్బంది వివరించారు. మరోవైపు సిబ్బంది మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు స్వదేశీ రోబోలను సైతం రంగంలోకి దింపి వారి శారీరక, మానసిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version