ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని లైంగిక వేధింపులు : డబ్ల్యూహెచ్​ఓ

-

నేటి సమాజంపై ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటా బయటా ఎక్కడా ఆడవాళ్లకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు తమ లైఫ్ టైమ్​లో శారీరక/లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఇందులో ఆగ్నేయాసియా రెండో స్థానంలో ఉందని పేర్కొంది. మహిళలపై జరుగుతోన్న హింసను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చింది.

అయితే జీవిత భాగస్వాములతోనే మహిళలు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని డబ్ల్యూహెచ్​ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. ఇలాంటి భౌతిక, లైంగిక హింస తక్షణం ప్రభావం చూపడంతోపాటు దీర్ఘకాలంలోనూ ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. ఇందులో శారీరక గాయాలతోపాటు మానసిక, సంతాన సమస్యలు, ప్రణాళిక లేని ప్రెగ్నెన్సీ, హెచ్‌ఐవీ వంటి సమస్యలూ ఉండే అవకాశం ఉందని వివరించారు.

మరోవైపు మహిళలపై హింసను అరికట్టేందుకు ఐక్య రాజ్య సమితి ప్రతి ఏడాది నవంబర్‌ 25వ తేదీన ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఈసారి 16 రోజులపాటు అవగాహనా కార్యక్రమాలను జరుపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version